దివికేగిన మన దేశభక్తుల
అడుగుజాడలే అనుసరింపవలెనోయీ
కారాగారమే ప్రాసాదముగా తుపాకి గుండ్లే పూల చెండ్లుగా
ఉరి చేరులనే ఉయ్యాలలుగా తలంచి ధర్మోధ్ధారణ కొరకై
ప్రతిఫలమ్ముల వాంఛింపకయే నీలాంబుదములు నీరమొసగినటు
కార్యరంగమున కర్మవీరులై స్వతంత్ర సమర జ్వాలల కెరయై
సమాజ సింధువులోని కణాలై స్వేఛ్చా సీమకు పునాది శిలలై
కదనరంగమున హుత జీవనులై మాతృపదమ్మున రాలిన విరులై
విశాల వసుధను వెల్లివిరిసిన పవిత్ర పౌరుష భారత భూమి
యశోగీతికను ఆలాపించే అమర విపంచిక తంత్రీస్వరులై
English Transliteration
divikEgina mana dESabhaktula
aDugujaaDalE anusarimpavalenOyI
kaaraagaaramE praasaadamugaa tupaaki gumDlE pUla cemDlugaa
uri cErulanE uyyaalalugaa talamci dharmOdhdhaaraNa korakai
pratiphalammula vaamChimpakayE nIlaambudamulu nIramosaginaTu
kaaryaramgamuna karmavIrulai svatamtra samara jvaalala kerayai
samaaja simdhuvulOni kaNaalai svEChchaa sImaku punaadi Silalai
kadanaramgamuna huta jIvanulai maatRpadammuna raalina virulai
viSaala vasudhanu vellivirisina pavitra pourusha bhaarata bhUmi
yaSOgItikanu aalaapimcE amara vipamcika tamtrIsvarulai
Post new comment