మనదే ఈ ప్రవహించే నిత్య సంస్కృతి
మనదే సువిశాలమైన భవ్య భారతి
హిమనగమ్ము సహస్రమై జాహ్నవి జాగృత ఝరియై
బదరీ వనమె శిరమై మలయ శ్రేణియె కరమై
పరమేశ్వరు శోభిల్లిన పవిత్ర పావన ధరలో
హల్దీ ఘాటిలోని రాణా మయమైన ధూళి
దేశభక్తి ప్రేరణకి రాజపుత్ర నివాళి
సమర్థ చైతన్యానికి శివుని వెనుక మావళీ
యుగయుగాల వైభవాలు మ్రోగించెను కాహళీ
బ్రహ్మ మయము బ్రహ్మ పురము ప్రాగ్జ్యోతికి శ్రీకారం
కోణారక రథములోన కాలచక్ర సంకేతం
కటకు నుండి అటకు వరకు ప్రసరించే ఈ కాంతియె
వేద సార జ్ఞానమునకు సత్య రూప ప్రకాశము
సత్య అర్ధ ప్రకాశము
సిరినగరం సింధూరం కేరళ పద మంజీరం
కన్యాకుమారిలోన యోగిక మూలాధారం
శబరిమలై జ్యోతులతో వెలిగించిన దీపాలకు
మానసరోవరములోన సుధా సింధు సాకారం
English Transliteration
manadE I pravahimcE nitya samskRti
manadE suviSaalamaina bhavya bhaarati
himanagammu sahasramai jaahnavi jaagRta Jhariyai
badarI vaname Siramai malaya SrENiye karamai
paramESvaru SObhillina pavitra paavana dharalO
haldI GhaaTilOni raaNaa mayamaina dhULi
dESabhakti prEraNaki raajaputra nivaaLi
samartha caitanyaaniki Sivuni venuka maavaLI
yugayugaala vaibhavaalu mrOgimcenu kaahaLI
brahma mayamu brahma puramu praagjyOtiki SrIkaaram
kONaaraka rathamulOna kaalachakra samkEtam
kaTaku numDi aTaku varaku prasarimcE I kaamtiye
vEda saara j~naanamunaku satya rUpa prakaaSamu
satya ardha prakaaSamu
sirinagaram simdhUram kEraLa pada mamjIram
kanyaakumaarilOna yOgika mUlaadhaaram
Sabarimalai jyOtulatO veligimcina dIpaalaku
maanasarOvaramulOna sudhaa simdhu saakaaram
Post new comment